మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.. కీలక మలుపు తిరిగింది. దాడి జరిగిన 24 గంటల తర్వాత.. 2024, డిసెంబర్ 9వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో మంచు మనోజ్.. స్వయంగా హైదరాబాద్ సిటీ శివార్లలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆయన వెంట సెక్యూరిటీలో భాగంగా కొంత మంది బౌన్సర్లు కూడా ఉండటం విశేషం.
పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో.. తనపై దాడి జరిగినట్లు మంచు మనోజ్ స్వయంగా కంప్లయింట్ చేశారు. జల్ పల్లిలోని ఇంట్లోనే.. తనపై.. తన భార్యపై తండ్రి మంచు మోహన్ బాబు సమక్షంలోనే.. విద్యానికేతన్ స్కూల్స్ పర్యవేక్షిస్తున్న వినయ్ అనే వ్యక్తి దాడి చేశాడని మనోజ్ కంప్లయింట్ చేశారు.
తనపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డానని.. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానంటూ ఆస్పత్రి రిపోర్టులు, స్కానింగ్ రిపోర్టులతో సహా మనోజ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. ఇంట్లో తనను రౌండ్ చేసి మరీ కొట్టారంటూ కంప్లయింట్ చేశారు. ఎలా కొట్టింది.. ఎవరెవరు కొట్టింది.. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పోలీసులకు వివరిస్తూ కంప్లయింట్ చేశారు మంచు మనోజ్.
ALSO READ | విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు.. పోటీగా 30 మంది బౌన్సర్లను దింపిన మంచు మనోజ్..!
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు సర్దుమణగలేదు. మంచు మోహన్ బాబు, చిన్న కొడుకు మంచు మనోజ్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని.. డయల్ 100 కు కాల్ చేయటం.. ఆ తర్వాత వాళ్ల వాళ్ల పీఆర్వో టీమ్స్ ఏమీ లేదని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. చిచ్చు మాత్రం ఆరలేదు. 2024, డిసెంబర్ 9వ తేదీ ఉదయం జల్ పల్లిలోని ఫాంహౌస్ కు వెళ్లిన మంచు లక్ష్మి.. తండ్రి మోహన్ బాబు, కొడుకు మనోజ్ తో మాట్లాడారు. మంచు లక్ష్మి జల్ పల్లి ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే.. ఆ ఇంటి నుంచి మోహన్ బాబు సైతం బయటకు వెళ్లిపోవటం ఆసక్తి రేపింది.
ఈ పరిణామాలు అన్నింటి తర్వాత మంచు మనోజ్ స్వయంగా పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయటంతో.. ఇప్పుడు ఈ అంశం కీలక మలుపు తిరిగింది. మంచు మనోజ్ పై కూడా మోహన్ బాబు లేదా విష్ణు కంప్లయింట్ చేస్తారా లేదా అనేది చూడాలి.