మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా మంచు విష్ణుపై మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మరోసారి వివాదం మొదలైంది. తన సోదరుడు మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష్ణుతో పాటు వినయ్ పై మనోజ్ ఫిర్యాదు చేశారు. మొత్తం 7 పేజీల ఫిర్యాదును పోలీసులకు పంపించారు. 7 అంశాల మీద మంచు విష్ణు, వినయ్ పై ఫిర్యాదు చేశారు.
అయితే ఇప్పటికే మంచు మనోజ్ మరియు మోహన్ బాబు ఒకరికొకరు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాను ఇంట్లో ఉన్న సమయంలో పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అరిచారనీ, అలాగే తమపై దాడి చేశారు అని గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ తర్వాత మోహన్ బాబు మనోజ్ పై ఫిర్యాదు చేయడం, కేసు పెట్టడం, బెయిల్ రావడం తెలిసిన విషయమే. అయితే పోలీసుల హెచ్చరికతో మంచు ఫ్యామిలీలో గొడవలు చల్లబడ్డాయనుకునే లోపే మరోసారిర మంచు మనోజ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.