Mohan babu birthday: తండ్రి బర్త్ డే రోజున మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్.. మిస్ అవుతున్నానంటూ..

Mohan babu birthday: తండ్రి బర్త్ డే రోజున మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్.. మిస్ అవుతున్నానంటూ..

టాలీవుడ్ సీనియర్ హీరో, ప్రొడ్యూసర్ మంచు మోహన్ బాబు పుట్టునరోజు కావడంతో బుధవారం పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు రెండో తనయుడు, స్టార్ హీరో మంచు మనోజ్ కూడా కూడా సోషల్ మీడియా ద్వారా తన తండ్రికి బర్త్ డే విషెష్ తెలిపాడు. ఇందులో భాగంగా ఎమోషనల్ ట్వీట్ ని షేర్ చేశాడు.

ఈ ట్వీట్ లో "నా ప్రియమైన నాన్న కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ పుట్టిన రోజు వేడుకలకి నీ పక్కన లేకున్నందున నిన్ను చాలా మిస్ అవుతున్నాము. కానీ నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను." అంటూ ఎమోషనల్ వర్డ్స్ షేర్ చేసాడు. అలాగే మోహన్ బాబుతో తాను చిన్నప్పుడు కలసి దిగిన ఫోటోలు, వీడియోలని షేర్ చేశాడు.. దీంతో పలువురు మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా మోహన్ బాబు కి విషెష్ చెబుతూ ట్వీట్ చేస్తున్నారు. 

అయితే పలు ఆస్థి వివాదాలు, మనస్పర్థలు కారణంగా గత కొన్నేళ్లుగా మనోజ్ మోహన్ బాబు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన భార్య భూమా మౌనిక, కొడుకుతో కలసి సెపెరేట్ గా ఉంటున్నాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు మనోజ్ కొన్నేళ్లుగా ఫ్యామిలీ సమస్యలతో ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న మంచు మనోజ్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం భైరవం, మిరాయ్ తదితర సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి.