Manchu Manoj: టాలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంచు మనోజ్ ని మంచు మోహన్ బాబు గత కొన్నేళ్లుగా దూరంగా ఉంచుతున్నారని అలాగే ఆస్తుల విషయంలో కూడా విబేధాలు మొదలయ్యాయని పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఆదివారం మంచు మనోజ్, మోహన్ బాబు గొడవపడి డయల్ 100 కు ఫోన్ చేసి ఒకరికపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంచు మనోజ్ తనపై అలాగే తన భార్య మౌనిక రెడ్డిపై మోహన్ బాబు దాడి చేసినట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు.
గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్ధి తగాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మోహన్ బాబుకి సంబంధించిన విద్యానికేతన్ విద్యాసంస్థలతోపాటూ, ఇతర ఆస్తుల పంపకాల విషయంలో అవకతవకలు జరిగాయని దీంతో మంచు మనోజ్ తన ఫ్యామిలీ దూరంగా ఉంటున్నాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయం ఇలా ఉండగా ఐతే గతంలో కూడా మంచు విష్ణు... మనోజ్ ఇంటికెళ్లి గొడవ పడినట్లు పలు వీడియోలు బయటికొచ్చాయి. ఈ వీడియోలలో మనోజ్ మాట్లాడుతూ తనకి కావాల్సిన వ్యక్తులపై విష్ణు తన అనుచరులతో వచ్చి దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశాడు. కానీ ఆ సమయంలో మంచు విష్ణు స్పందిస్తూ తమ ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని కాలారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మళ్ళీ ఫిర్యాదుల విషయం బయటపడటంతో వివాదాలు ముదురినట్లు తెలుస్తోంది.