టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.రీసెంట్ గా హీరో మంచు మనోజ్ వాట్ ది ఫిష్( What The Fish) అనే మూవీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. వాట్ ది ఫిష్..మనం మనం బరంపురం అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్.
లేటెస్ట్ గా మంచు మనోజ్ ట్విట్టర్లో కెమెరా ముందు నిల్చుని..కెమెరాకు దండం పెడుతూ..ఓక ఫోటో పోస్ట్ చేశారు.అలాగే అమ్మ లాంటి సినిమా దగ్గరకు మళ్ళీ వచ్చాను..లవ్ యూ సినిమా.. నన్ను ప్రేమిస్తున్న ఫ్యాన్స్ అందరికీ నా ప్రేమ అంటూ.. రాసుకొచ్చారు.దీంతో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీని వరుణ్ డైరెక్ట్ చేయబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లో మంచు మనోజ్ లుక్ ఆకట్టుకుంటుంది.
వాట్ ది ఫిష్ మూవీ పోస్టర్.. చుట్టూ భయంకరమైన విదేశీ డాన్ లు కనిపిస్తుంటే..వారినీ ఎదుర్కోవటానికి సిద్ధమవుతున్న హీరో పిడికిలి బిగించి బ్యాక్ ఫీట్ లో కనిపించారు. ఇందులో యాక్షన్ సీన్స్ ను రొటీన్ గా కాకుండా కాస్త వెరైటీగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పోస్టర్ లో గాగుల్ మాస్క్ తో ఉన్న ఒ అమ్మాయి కూడా కనిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో నటిస్తున్న మిగతా నటీనటులు, సాంకేతిక క్యారెక్టర్స్ వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
మంచు మనోజ్ మూవీస్ కి బ్రేక్ ఇచ్చి చాలా రోజులైనా..ఫ్యాన్స్ తన మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో మంచు ఈ సారి గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఇక మంచు మనోజ్ గత చిత్రాలు గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు మూవీస్ తర్వాత గ్యాప్ తీసుకున్నారు.
Back to my Amma, CineMA ??❤️ Love you all with all my heart ❤️ pic.twitter.com/woQRMveQmK
— Manoj Manchu??❤️ (@HeroManoj1) August 21, 2023