Manchu Manoj: ‘దొంగప్ప’ అంటూ మనోజ్ సెటైరికల్ పోస్ట్.. కమిషన్ నొక్కేసాడంటూ సంచలనం

Manchu Manoj: ‘దొంగప్ప’ అంటూ మనోజ్ సెటైరికల్ పోస్ట్.. కమిషన్ నొక్కేసాడంటూ సంచలనం

మంచు కుటుంబ పంచాయితీ మరింత ముదురుతోంది. మూడ్రోజులుగా సోషల్ మీడియాలో మంచు వారి కుటుంబ కథనాలే ఎక్కువయ్యాయి. తాను ఇంట్లో లేనప్పుడు తన కారు, ఇతర వస్తువుల్ని ఎత్తుకెళ్లారని మనోజ్ (Manchu Manoj).. అన్న విష్ణుపై కేసు పెట్టడం, జల్‌పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం చూస్తూ వస్తున్నాం.

ఈ క్రమంలో మనోజ్ X లో ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. అది కూడా మంచు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా మీద చేసినట్లు తెలుస్తోంది. ' మీ క్యాలెండర్లను గుర్తు పెట్టుకోండి! దొంగప్ప యొక్క పురాణం జూన్ 27న వెండి తెరపైకి వస్తుంది! ఇంతకి విడుదల జూలై 17నా లేక జూన్ 27నా? 100 కోట్లకు పైగా బడ్జెట్ (ఇందులో 80% #ViSmith కమిషన్)తో సినిమా PR ప్రణాళిక కేక' అంటూ పోస్ట్లో తెలిపాడు. ఓ పంది ముఖం ఉన్న, మనిషి డబ్బులు దొంగతనం చేసుకొని పారిపోతున్నట్లు కనిపిస్తున్న జిఫ్ పోస్ట్ చేసాడు.

►ALSO READ | OTT New Movies: ఓటీటీకి వచ్చేసిన ఇండస్ట్రీ సూపర్ హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, ఈ పోస్ట్లో దొంగప్ప అని మనోజ్ ప్రస్తావించడంతో.. ఇది మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించే అని, విష్ణు 80 శాతం నొక్కేసాడని ఇండైరెక్ట్ గా వెల్లడించినట్లుగా ఉంది. మరి ఈ విషయంపై విష్ణు ఎలా స్పందిస్తాడనేది చర్చనీయాంశంగా మారింది. 

అయితే, బుధవారం (ఏప్రిల్ 9న) కన్నప్ప కొత్త రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు మంచి విష్ణు. జూన్ 27న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మంచు మోహన్‌బాబు, విష్ణు భేటీ అయ్యి, ఈ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇక ఈ విడుదల తేదీని ఉద్దేశించి మనోజ్ ట్వీట్ చేసాడు. అంతేకాకుండా తన భైరవం మూవీకి భయపడి, ఏప్రిల్ 25న రిలీజ్ కావాల్సిన కన్నప్పను జూన్లో తీసుకొస్తున్నాడు అంటూ మనోజ్ తెలిపాడు.