మంచు వివాదం: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసిన మనోజ్

గత రెండు రోజులుగా మళ్లీ మంచు వార్ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో ఇంటి రచ్చ కాస్త వీధి నుంచి పోలీస్ స్టేషన్ కు ఆ తర్వాత కలెక్టర్ దగ్గరకు  చేరింది.   మోహన్ బాబు ఫిర్యాదుతో  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మంచు మనోజ్ కు నోటీసులిచ్చారు. దీంతో మనోజ్ తన లీగల్ టీంతో జిల్లా కలెక్టరేట్ కు  చేరుకున్నారు. అదనపు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ను కలిశారు. ఆస్తుల వివాదంపై చర్చించారు.  మరి కాసేపట్లో మోహన్ బాబు కూడా కలెక్టరేట్ కు వచ్చే వచ్చే అవకాశముందని తెలుస్తోంది.  

 అంతకు ముందు మోహన్ బాబు  రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు.  రంగారెడ్డి జిల్లా జల్ పల్లిలో ఉన్న తన ఆస్థులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని .. తన నివాసంలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేసి తనకు అప్పగించాలని  కలెక్టర్ ను  కోరారు .మోహన్ బాబు  గత కొన్ని రోజుల నుంచి తిరుపతిలో ఉంటున్నారు. మనోజ్ జల్ పల్లిలోని ఫామ్ హౌస్ లో ఉంటున్నారు.  సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు మోహన్ బాబు. 

ALSO READ | Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్

 మోహన్ బాబు ఫిర్యాదు పై స్పందించిన జిల్లా కలెక్టర్..  పోలీస్ ల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై  నివేదిక తీసుకున్నారు. అనంతరం జల్ పల్లి లోని ఫామ్ హౌస్ లో ఉంటున్న మంచు మనోజ్ కి నోటీసులిచ్చారు కలెక్టర్. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ ను కలిశారు మనోజ్.