హైదరాబాద్: బంజారాహిల్స్ టిఎక్స్ హాస్పిటల్కు మంచు మనోజ్ వెళ్లాడు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో చేరినట్లు తెలిసింది. ఆదివారం ఉదయం మోహన్ బాబుకు, మంచు మనోజ్కు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ గొడవలో మోహన్ బాబు అనుచరుడు మనోజ్పై దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జల్‌పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దాడి జరిగినట్లు తెలిసింది.
— దివిటి ఛానల్ (@risingsun143) December 8, 2024
మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి ఆస్పత్రికి వెళ్లాడు. నడవలేని స్థితిలో మంచు మనోజ్ ఉండటంతో అతనిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శ్రీవిద్యా నికేతన్ స్కూల్‌కు సంబంధించిన సిబ్బంది తనపై దాడి చేశారని మనోజ్ ఆరోపించాడు. ఇప్పటికే మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి.
అసలేం జరిగిందంటే..
మంచు కుటుంబంలో విభేదాల వార్తలు ఆదివారం ఉదయం నుంచి అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మంచు మనోజ్, మోహన్‌బాబు నుంచి ఈ గొడవలకు సంబంధించి ఫిర్యాదులు అందలేదని తెలిసింది. ఎలాంటి దాడి జరగలేదని మోహన్‌బాబు పీఆర్‌వో వివరణ కూడా ఇచ్చారు.
Also Read:-ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో: ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు..
అయితే.. ఇందులో నిజం ఏంటంటే.. మనోజ్ పై దాడి జరిగింది. అతని కాలికి గాయమైంది. అతనిపై దాడి చేసింది మోహన్ బాబు అనుచరుడని వార్తలొచ్చాయి. ఎవరు కాల్ చేశారనే విషయంలో స్పష్టత లేదు గానీ డయల్ 100 నంబర్కు మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి కాల్ వెళ్లింది. తమ కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్నాయని మోహన్ బాబు కుటుంబ సభ్యులు కాల్లో పోలీసులకు చెప్పారు. దీంతో.. పోలీసులు హుటాహుటిన జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మోహన్ బాబు కుటుంబ సభ్యులకు పోలీసులు స్పష్టం చేశారు.
ఈ గొడవల గురించి మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో మంచు కుటుంబం తమ పరువుమర్యాదలకు భంగం వాటిల్లుతుందని గ్రహించింది. అప్రమత్తమైన మోహన్ బాబు తన పీఆర్వోతో ఎలాంటి దాడి జరగలేదని, మీడియాలో అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని జరిగిన ప్రచారంలో నిజం ఉందో.. లేదో గానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల డయల్ 100కి మోహన్ బాబు కుటుంబం నుంచి కాల్ వెళ్లినట్లు పహాడీషరీఫ్ ఎస్ఐ వివరణతో స్పష్టమైంది.