మా అన్న కోసం లేడీ గెటప్ కూడా వేశా.. కానీ వాళ్ళు మాత్రం అలా అంటూ మంచు మనోజ్ సీరియస్..

మా అన్న కోసం లేడీ గెటప్ కూడా వేశా.. కానీ వాళ్ళు మాత్రం అలా అంటూ మంచు మనోజ్ సీరియస్..

మంచు ఫ్యామిలీ వివాదాలు రోజురోజుకి ముదురుతున్నాయి. దీంతో ఎన్ని పంచాయతీలు చేసినా.. పోలీసులు కోర్టులు ఇన్వాల్వ్ అయినా మంచు ఫ్యామిలీలో గొడవలు మాత్రం సర్ధుమణగడం లేదు. అయితే తాజాగా మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు ఇంటికి వెళ్లి నిరసన చేపట్టాడు. తన వస్తవులు మోహన్ బాబు ఇంట్లో ఉన్నాయని వాటిని తీసుకునేందుకు వెళితే ఇంట్లోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే మంచు విష్ణుకి  తానంటే చిన్నప్పటినుంచి కుళ్ళు అని అందుకే ప్రతీ విషయంలో ఇలానే ప్రవర్తిస్తుంటాడని చెప్పుకొచ్చాడు. తన కారుని రెండో కీ ని ఉపయోగించి దొంగతనంగా తీసుకెళ్లాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మంచు విష్ణు కెరీర్ కోసం తనని తండ్రి మోహన్ బాబు బాగా ఉపయోగించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో తాను ఇతర బ్యానర్స్ లో సినిమాలు చేసి హిట్ కొట్టి ఫేమ్, డబ్బు సంపాదించుకున్నానని కానీ ఎప్పుడూ కూడా ఇంట్లో నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇక తన అన్న కోసం లేడీ గెటప్ పాత్రలు కూడా చేశానని అయినప్పటికీ తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు.  దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ మరోసారి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

►ALSO READ | వీడియో వైరల్: అల్లు అర్జున్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. బన్నీ రియాక్షన్కు నెటిజన్లు ఫిదా

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు మనోజ్ తెలుగులో "భైరవం" అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో గజపతి పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా స్టార్ సినీ ప్రొడ్యూసర్ కేకే రాధా మోహన్ నిర్మిస్తున్నాడు.