మా నాన్న మారిపోయాడు.. అప్పట్లో దేవుడు.. ఇప్పుడు కాదు : మంచు మనోజ్

మా నాన్న మారిపోయాడు.. అప్పట్లో దేవుడు.. ఇప్పుడు కాదు : మంచు మనోజ్

మంచు ఫ్యామిలీ వార్ రోడ్డెక్కింది. నిన్నా మొన్నటి వరకు లీకులు మాత్రమే ఇచ్చినా వారు.. ఇప్పుడు ప్రెస్ మీట్ల దగ్గరకు వచ్చేశారు. తొలిసారి మంచు మనోజ్ మీడియోతో వివరంగా మాట్లాడారు. కథ మొత్తం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతానన్న మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మా నాన్న మోహన్ బాబు దేవుడు.. అప్పట్లో దేవుడి లెక్క ఉండే వారు.. ఇప్పుడు కాదంటూ వ్యాఖ్యానించారు మంచు మనోజ్. మా నాన్న మారిపోయాడు.. దేవుడి లెక్క ఉండే ఆయన్ను మార్చేశారు అంటూ అన్నయ్య విష్ణుపై పరోక్షంగా విమర్శలు చేశారు మనోజ్. మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి.. నన్ను కాస్తున్నారు అంటూ ఇంట్లో గొడవలకు కారణం ఎవరు అనేది చెప్పకనే చెప్పారు మనోజ్.

మా నాన్న, అమ్మను అన్నయ్య విష్ణు ట్రాప్ చేశారని.. అతని మాయలో ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు మనోజ్. కుటుంబ ఆస్తిలో నేను ఎప్పుడూ ఒక్క రూపాయి తీసుకున్నదీ లేదు.. ఆశించిందీ లేదని.. మద్యానికి బానిస అయ్యి కొడుతున్నట్లు తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ తన తండ్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంచు మనోజ్.

Also Read :- మోహన్ బాబు నెక్ట్స్ చేయబోతోంది ఇదే

ఈ వివాదంలోకి నా భార్య, పిల్లలను అనవసరంగా లాగుతున్నారని.. నా బంధువులపైనా దాడి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు మనోజ్.ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని.. తన కోసం వచ్చిన మీడియా మిత్రులకు ఇలా జరగడం బాధాకరమని అన్నారు మనోజ్. మోహన్ బాబు, విష్ణుల తరపున మీడియా మిత్రులకు క్షమాపణ తెలుపుతున్నానని అన్నారు మనోజ్.

మా నాన్నను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని..  మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారని అన్నారు మనోజ్. భార్యతో కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టానని.. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారని అన్నారు. తనపై దాడులు చేశారని.. తండ్రి మోహన్ బాబు ముందే తనను కొట్టారని అన్నారు. తనకు సపోర్ట్ చేస్తున్న తల్లిని కూడా డైవర్ట్ చేశారని ..మూడు రోజులు బయటకు వెళ్ళమని.. మనోజ్ కి సర్ధిచెప్తామని తల్లిని కూడా నమ్మించారని అన్నారు మనోజ్.

తాను ఇంట్లో ఎలాంటి డబ్బు, ఆస్థి అడగలేదని.. కంటతడి పెట్టారు మనోజ్. తన భార్య 7 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు బాధలు అనుభవించిందని ..తన బంధువులపై దాడి చేశారని అన్నారు మనోజ్.మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అన్ని విషయాలు అందరికీ తెలియాలి అని.. అందుకే ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు పూర్తిగా వివరిస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు మంచు మనోజ్.