Manchu Manoj: మేము ముగ్గురం న‌లుగురం అయ్యాం.. మంచు మ‌నోజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

Manchu Manoj: మేము ముగ్గురం న‌లుగురం అయ్యాం.. మంచు మ‌నోజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

టాలీవుడ్ హీరో మంచు మనోజ్-మౌనిక దంపతులకు గత సంవత్సరం (2024) కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ పాపకి దేవసేన అని పేరు పెట్టినట్టు అధికారికంగా మంచు ఫ్యామిలీ ప్రకటించింది. అంతేకాకుండా పాపకి 'MM పులి' అనే నిక్ నేమ్ కూడా ఉంది.

అయితే, మనోజ్, మౌనికకు కూతురు పుట్టి సంవత్సరం అయింది. ఈ సందర్భంగా మనోజ్ తన కూతురు దేవసేన ఫస్ట్ బర్త్డే స్పెషల్గా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు షేర్ చేశారు. 

"మా ప్ర‌పంచం మ‌రింత మాయ‌జాలంగా మారింది. మేము ముగ్గురం న‌లుగురం అయ్యాం. నాలుగు హృద‌యాలు.. నాలుగు ఆత్మ‌లు. ఒక అచంచ‌ల‌మైన బంధ‌మిది. ప్రేమ‌, బ‌లం శాశ్వ‌తంగా నిర్మించిన కుటుంబం ఇది. దేవ‌సేన శోభా, మా పులి. త‌ను మా జీవితాల్లోకి వెలుగు, ధైర్యం, అనంత‌మైన ఆనందాన్ని తీసుకొచ్చింది. 

అమ్మ‌, నేను, అన్న‌య్య ధైర‌వ్ ఎల్ల‌ప్పుడూ నీకు తోడుగా ఉండి ర‌క్షిస్తాం. అంద‌మైన క‌ల‌ల‌తో నిండిన జీవితాన్ని క‌లిసి నిర్మించుకుందాం. మేము నిన్ను మాట‌ల‌కు అంద‌నంత‌గా ప్రేమిస్తున్నాం. దేవ‌సేన‌కు మొద‌టి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు" అంటూ మ‌నోజ్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manoj Manchu (@manojkmanchu)

అలాగే మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఇన్స్టాలో వీడియో షేర్ చేసింది. ఈ మేరకు స్పెషల్ పోస్ట్ చేస్తూనే తన అభిప్రాయాన్ని పంచుకుంది.

"నువ్వు పుట్టే ముందు రోజే దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. నేను ఆల్రెడీ వెళ్లిపోవడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, వర్క్ కూడా ఉంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు పుట్టావు దేవసేన.

►ALSO READ | డిఫరెంట్ కథతో థ్రిల్ చేసే బ్లడ్ రోజెస్..

నిన్ను మొదట ఎత్తుకున్నది మీ అమ్మ, మీ నాన్న కాదు నేనే. నువ్వు పుట్టిన రోజంతా నేను నీతోనే గడిపాను. నువ్వు నాకు బాగా కనెక్ట్ అయ్యావు. మన ఇద్దరి మధ్య ఒక మంచి అనుబంధం ఉంది. నేను అది మాటల్లో చెప్పలేను. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్యూ" అని మంచు లక్ష్మి తెలిపింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో మనోజ్ ఫ్యాన్స్, నెటిజన్లు మనోజ్ కూతురుకు   బర్త్ డే విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.