
వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు హీరో మంచు మనోజ్. తాజాగా తిరుపతి లో భాకరాపేట పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగటంతో హైడ్రామా నెలకొంది. తిరుపతి జిల్లా భాకరాపేట సమీపంలోని ఓ రిసార్ట్ లో సోమవారం (ఫిబ్రవరి 17) రాత్రి బస చేస్తున్న సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రోజూ వారి తనిఖీల్లో భాగంగా రిసార్ట్ కు వెళ్లిన పోలీసులు.. అర్ధరాత్రి, అటవీప్రాంతంలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
దీంతో ఆగ్రహించిన మనోజ్.. తనపై నిఘా పెట్టారా అని ప్రశ్నించారు. తాను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంటే పోలీసులకు ఇబ్బందేంటని అసహనం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగానే వచ్చామని చెప్పారు. సెలబ్రిటీలకు ఇది సరైన చోటు కాదని సూచించారు. ఈ క్రమంలో పోలీసులకు, మనోజ్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీసుల అదుపులో మంచు మనోజ్..
— సూర్యకాంతం 🕊️ (@katthiteesukora) February 18, 2025
కుటుంబ తగాదాల నేపథ్యంలో రిజిస్టర్ అయిన కేసులో.. #ManchuManoj #ManchuFamily
pic.twitter.com/WR0cHHtgAa
పోలీసులు తమ భద్రత గురించి మాట్లాడటం ఒక డ్రామా అని, తనను నిఘా పెట్టారని, అరెస్టు చేయడానికే వచ్చారని మనోజ్ ఆరోపించారు. ‘‘నేనేమీ టెర్రరిస్టు కాదు.. దొంగను కాదు.. నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు..? ’’అంటూ ఆగ్రహంతో స్టేషన్ ముందు బైఠాయించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ హైడ్రామా జరిగింది. విషయం తెలుసుకున్న సీఐ వచ్చి సర్ధి చెప్పదంతో ఆందోళన విరమించారు.