మా అన్నవిష్ణు వల్లే ఇదంతా .. మా అమ్మ ఆస్పత్రిలో ఉందనేది అబద్ధం: మనోజ్

మా అన్నవిష్ణు వల్లే ఇదంతా .. మా అమ్మ ఆస్పత్రిలో ఉందనేది అబద్ధం: మనోజ్

వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నారని..ఇదంతా తన తండ్రికి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు మంచు మనోజ్ . రాచకొండ సీపీని కలిసి అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడాడు.   తన అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారనేని అవాస్తవమన్నారు . తన అన్న విష్ణు ప్రోత్బలంతోనే  ఇదంతా జరుగుతుందన్నారు మనోజ్.

తాను ఫిర్యాదులో పేర్కొన్న విజయ్, కిరణ్ అనే వ్యక్తులని  పోలీసులు పట్టుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు మనోజ్ .   కూర్చొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తాను సిద్దమన్నారు మనోజ్.. పోలీస్ వ్యవస్థపై  నమ్మకం ఉంది.. నాకు  న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా ఉందన్నారు మంచు మనోజ్. ఇంటి దగ్గర ఎక్కువగా   పబ్లిక్ ఉండకూడదని పోలీసులు సూచించారని తెలిపారు. సమస్య పరిష్కారం అయితే అందరికీ సంతోషమన్నారు మనోజ్  .చంద్రగిరి పెద ప్రజల కోసం నేను పోరాడుతున్నానని చెప్పారు మనోజ్.

ALSO READ | మంచు తుఫాను: మోహన్ బాబుకు పెరిగిన హార్ట్ రేట్.. మంచు విష్ణు సీరియస్ వార్నింగ్..

మరో వైపు తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు, విష్ణులకు ఊరట లభించింది. పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది.  డిసెంబర్ 11న విచారణకు హాజరుకావాలంటూ మోహన్ బాబుకు, విష్ణుకు,మనోజ్ కు  రాచకొండ సీపీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసింందే. మనోజ్ సీపీ ముందు హాజరుకాగా.. నోటీసులపై మోహన్ బాబు హైకోర్టులోలంచ్ మోషన్  పిటిషన్ దాఖలు చేశారు . ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్ట్ .. ఈ గొడవలు మోహన్ బాబు కుటుంబ వ్యవహారమని తెలిపింది .  ప్రతి రెండు  గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటిని పర్యవేక్షించాలని పోలీసులను  ఆదేశించింది హైకోర్టు.తదుపరి విచారణను డిసెంబర్  24 కు వాయిదా వేసింది.