మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. ఆస్తి తగాదాలో భాగంగా ఫిబ్రవరి 3న మధ్యాహ్నం నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. డాక్యుమెంట్స్ తో కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లారు మనోజ్. కలెక్టరేట్ కార్యాలయంలోని మెజిస్ట్రేట్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు . మోహన్ బాబు ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇద్దరికీ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే..
ALSO READ | గోవాలో ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
జనవరి 18న మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా జల్ పల్లిలో ఉన్న తన ఆస్థులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని .. తన నివాసంలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేసి తనకు అప్పగించాలని కలెక్టర్ ను కోరారు . మనోజ్ జల్ పల్లిలోని ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు మోహన్ బాబు.
మోహన్ బాబు ఫిర్యాదు పై స్పందించిన జిల్లా కలెక్టర్.. పోలీస్ ల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్నారు. అనంతరం జల్ పల్లి లోని ఫామ్ హౌస్ లో ఉంటున్న మంచు మనోజ్ కి నోటీసులిచ్చారు కలెక్టర్. ఈ క్రమంలోనే మనోజ్ తన లీగల్ టీంతో అదనపు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ను కలిశారు. ఆస్తుల వివాదంపై చర్చించారు. మళ్ళీ ఫిబ్రవరి 3న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే మనోజ్ ఇవాళ విచారణకు హాజరయ్యారు