గొడవలపై స్పందించిన మంచు ఫ్యామిలీ.. అవాస్తవాలు అంటూ మీడియాకి సమాచారం

మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకుని.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినట్లు సోషల్ మీడియా, పలు టీవీ ఛానెళ్లలో ఆదివారం (డిసెంబర్ 8) పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏకంగా గాయాలతోనే పీఎస్‎కు వెళ్లి మనోజ్, మోహన్ బాబు పరస్పరం కంప్లైంట్‎లు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఆస్తుల విషయంలోనే ఈ వివాదం తలెత్తినట్లు ప్రచారం జరిగింది. 

మంచు మనోజ్, అతడి తండ్రి మోహన్ బాబు పరస్పరం భౌతిక దాడులు చేసుకున్నట్లు జరిగిన ప్రచారం క్షణాల్లోనే సోషల్ మీడియా, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయని.. పీఎస్‎లో ఫిర్యాదులు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో మంచు ఫ్యామిలీ రియాక్ట్ అయ్యింది.  

Also Read : మంచు ఫ్యామిలీలో గొడవలు.. చిన్న కొడుకు మనోజ్ పై మోహన్ బాబు దాడి

‘‘మోహన్ బాబు, మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం‌ లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఎవిడెన్స్‎లు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి’’ అని మంచు ఫ్యామిలీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 

 గతంలో కూడా మంచు ఫ్యామిలీలో ఆస్తుల విషయంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అన్నదమ్ములు మంచు మనోజ్, మంచు విష్ణుకు తగదా పెట్టుకున్నారు. విష్ణు తన అనుచరులతో నా ఇంటికి వచ్చి దాడి చేశాడని మనోజ్ వీడియో రిలీజ్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అప్పటి నుండి ఫ్యామిలీతో మంచు మనోజ్  దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి వివాదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది.