![కన్నప్పలో శివరాజ్ కుమార్](https://static.v6velugu.com/uploads/2023/10/Manchu-Vishnu-acting--hero-film-Kannappa-being-produced--directed--Mukesh-Kumar-Singh_tvO9T6SUZk.jpg)
మంచు విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఇప్పటికే ఇందులో ప్రభాస్, మోహన్ లాల్ కీలకపాత్రలు పోషిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. తాజాగా శివరాజ్ కుమార్ కూడా ఇందులో ఓ కీలకపాత్రను పోషించబోతున్నారు. ఆయన తండ్రి రాజ్ కుమార్ నటించిన ఫస్ట్ మూవీ ‘బేదర కన్నప్ప’ (1954) అప్పట్లో ఏడాదికి పైగా ఆడడంతో పాటు నేషనల్ అవార్డును కూడా అందుకుంది.
ఆ సినిమా తెలుగు రీమేక్ ‘కాళహస్తి మహత్యం’లోనూ ఆయనే హీరోగా నటించారు. తెలుగులో రాజ్ కుమార్ నటించిన ఏకైక సినిమా అది. ఇంతలా కన్నప్ప కథతో రాజ్ కుమార్ ఫ్యామిలీకి అనుబంధం ఉంది. దీంతో ఆయన కొడుకు శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో ఏ పాత్రను పోషించబోతున్నారో అనే ఆసక్తి నెలకొంది.