మంచు వారి డ్రీమ్ ప్రాజెక్టులో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా

మంచు వారి డ్రీమ్ ప్రాజెక్టులో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప నుంచి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్గా మరో అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా నటిస్తున్నారు. వీళ్ల ఫొటోలను మూవీ టీం రిలీజ్ చేసింది.

ఈ విషయాన్ని తెలుపుతూ మోహన్ బాబు ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు విష్ణు తెలిపారు. 'పరమేశ్వరుడి గొప్ప భక్తుడి కథ తెలుసుకునేందుకు సిద్ధం కండి" అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని 'కన్న ప్ప' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'మహాభా రత' సిరీస్ ని రూపొందించిన ముఖేష్కు మార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహి స్తున్నారు. భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుం డగా.. ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

Also Read:-రామాయణం నాటకంలో రాక్షసుడు.. వేదికపైనే పందిని చంపి తినేశాడు...

ఈ మూవీలో శరత్ కుమార్, మధుబాల, ప్రీతి ముకుందన్ తదితరులు కీలక పాత్రల్లోకని పించనున్నారు. విష్ణు తనయుడు అవ్రామ్ ఈ చిత్రంతో తెరంగేట్రం చేయనున్నారు. బాల తిన్నడుగా అతడు కనిపించనున్నాడు.