ప్రభాస్‌పై బాలీవుడ్‌ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు..మా అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్

ప్రభాస్‌పై బాలీవుడ్‌ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు..మా అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్

పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ (Prabhas) ని ఉద్దేశించి బాలీవుడ్ యాక్టర్ అర్ష‌ద్ వార్సీ(Arshad Warsi)  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. క‌ల్కి సినిమాలో ప్ర‌భాస్ పాత్ర‌ని ఉద్దేశించి అదొక జోక‌ర్ రోల్ అని..ప్ర‌భాస్ త‌న‌కి జోక‌ర్ లా క‌నిపించాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ తో టాలీవుడ్ నుంచి ప‌లువురు సెల‌బ్రిటీలు ఘాటుగా స్పందిస్తున్నారు.

తాజాగా మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు బాలీవుడ్‌ నటుడు శ్రీ అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షరాలు శ్రీమతి పూనమ్ ధిల్లాన్ కు మంచు విష్ణు లేఖ రాసారు. 

"తెలుగు సినీ వర్గాల్లో నటుడు ప్రభాస్ పై అర్షద్ వార్సీ వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో మరియు అభిమానులలో చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది.ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కును మేము గౌరవిస్తాము.కానీ నటుడు ప్రభాస్ పాత్రను గురించి శ్రీ వార్సి చేసిన వ్యాఖ్యలపై నేను విచారిస్తున్నాను. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ప్రతి పదం చాలా త్వరగా విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉంది. మనం సినిమా సెలబ్రెటీస్ వ్యక్తులం. మన వ్యక్తీకరణలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మాట్లాడే వాటిలో మంచి ఉన్నా, చెడు ఉన్నా అది వెంటనే వ్యాపిస్తుంది కాబట్టి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు శ్రీ వార్సి మానుకోవాలని..మా నటుల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా వ్యాఖ్యలు తిరిగి పునరావృతం కావని విశ్వసిస్తున్నాను అన్నారు విష్ణు. 

Also Read :- మారుతీ నగర్ సుబ్రమణ్యం’ రివ్యూ

అలాగే ప్రాంతీయ అనుబంధంతో సంబంధం లేకుండా, మన సహోద్యోగులలో ప్రతి ఒక్కరికీ దక్కాల్సిన గౌరవం మరియు గౌరవాన్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం. మనమందరం సినిమా అనే ఒక పెద్ద కుటుంబంలో భాగమని, సినిమా పట్ల మనకున్న అభిరుచికి కట్టుబడి ఉన్నామని గుర్తుంచుకోండి. మన బలం మన ఐక్యతలో ఉంది మరియు ఈ ఐక్యతను కాపాడుకోవడం మన సమిష్టి బాధ్యత అని గుర్తు చేశారు. మా పరిశ్రమ కోసం నిలబడే సామరస్యం మరియు గౌరవాన్ని కొనసాగించడంలో మీ మద్దతు కోసం నేను ఎదురు చూస్తున్నాను" అంటూ లేఖను ముగించారు మంచు విష్ణు. 

ఇప్పటికే..సుధీర్ బాబు స్పందిస్తూ..'నిర్మాణాత్మ కంగా విమ‌ర్శించినా ప‌ర్వాలేదు. కానీ ఇలా త‌ప్పుగా మాట్లాడ‌వ‌ద్దు. వార్సీలో వృత్తినైపుణ్యం లోపించింది. ప్ర‌భాస్ స్థాయి చాలా పెద్ద‌ది. అలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉండ‌కూడ‌దు`అని తెలిపారు. ప్ర‌భాస్ కి మ‌ద్ద‌తుగా ఇప్ప‌టికే నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్, సాయికుమార్, ఎస్ కె.ఎన్, సిద్దు జొన్నలగడ్డ నిలిచారు.అయితే ఇది స‌రిపోదు. ఇంకా టాలీవుడ్ నుంచి చాలా మంది స్పందించాల్సి ఉంది.అయితే వార్సీ వ్యాఖ్య‌ల‌పై ఇంకా ప్ర‌భాస్ గానీ, అత‌ని కుటుంబ స‌భ్యులుగానీ స్పందించ‌లేదు.