Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌.. కన్నప్ప కామిక్‌ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌.. కన్నప్ప కామిక్‌ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌‌‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్‌‌‌‌ లాల్, శివరాజ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇటీవల కన్నప్ప కామిక్ బుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.  

ఈ నేపథ్యంలో కన్నప్ప కామిక్ వీడియోను రిలీజ్ చేశారు మంచు విష్ణు. ఇప్పుడు యానిమేటెడ్‌ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను విష్ణు షేర్ చేసుకున్నారు. ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది.

అంతేకాకుండా ఇందులో కన్నప్ప సాహసం, భావోద్వేగం, ఆధ్యాత్మిక భావనలను చూపించనున్నట్లు విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు  ఎపిసోడ్ 1 యూట్యూబ్ లో ప్రసారం అవుతోంది. ఆలస్యం ఎందుకు కన్నప్ప యానిమేటెడ్‌ సిరీస్‌ చూసి.. సినిమా ఎలా ఉండనుందో అంచనాలు వేసుకోండి. 

Also Read :- ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఇకపోతే ‘మహాభారతం’ టీవీ సిరీస్‍ను తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు నిర్మిస్తున్నారు.  బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, శరత్‍కుమార్, దేవరాజ్, ఐశ్వర్య, ముకేశ్ రుషి ఇతర పాత్రలు  పోషిస్తున్నారు.