రిలీజ్ కి ముందే రికార్డులు బ్రేక్ చేస్తున్న కన్నప్ప.. బ్లాక్ బస్టర్ హిట్ తప్పదా..?

రిలీజ్ కి ముందే రికార్డులు బ్రేక్ చేస్తున్న కన్నప్ప.. బ్లాక్ బస్టర్ హిట్ తప్పదా..?

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే కామియో పాత్ర చేస్తుండగా బాలీవడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నాడు. తమిళ్ మళయాళ నటులు శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా రెండో టీజర్ ని మేకర్స్ పాన్ ఇండియా భాషల్లో సోమవారం రిలీజ్ చేశారు. 

మంచి ఇంటెన్సివ్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన రెండవ టీజర్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది. అయితే ఈ టీజర్ రిలీజ్ చేసిన 6 రోజుల్లోనే దాదాపుగా 35 మిళియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇందులో తెలుగులో మాత్రమే 21 మిలియన్ వ్యూస్ ఉండగా హిందీలో 10 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.. ఇతర భాషల్లో 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర సినిమా టీజర్(24 మిలియన్స్) వ్యూస్ రికార్డులని బ్రేక్ చేసింది. అంతేహ్కాదు మంచు విష్ణు కెరీర్ లోనే హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన టీజర్ గా రికార్డులు క్రియేట్ చేసింది.. 

ALSO READ | పాన్ మసాలాని ప్రమోట్ చేసిన బడా హీరోలకి షాక్.. జైలు తప్పదంటూ..?

అయితే ఇప్పటివరకూ సరైన బ్రేక్ లేక, రాక ఇబ్బంది పడుతున్న హీరో మంచు విష్ణు కన్నప్ప సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.. దీంతో స్టోరీ, ప్రొడక్షన్ పనులు, మేకింగ్, టెక్నీకల్ పనులు ఇలా ప్రతీది దగ్గరుండి చూసుకుంటున్నాడు.. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా భాషలతోపాటూ ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. కన్నప్ప ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా  రిలీజ్ కానుంది.