Kannappa First Look: కన్నప్ప నుండి పవర్ఫుల్ ఫస్ట్ లుక్.. చేతిలో విల్లుతో మంచు విష్ణు అదుర్స్

మంచు విష్ణు(Manchu Vishnu) ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న సినిమా కన్నప్ప(Kannappa). మహా శివ భక్తుడైన కన్నప్ప జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్(Mukhesh Kumar Singh) తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా నుండి తాజాగా మంచు విష్ణు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. 

మార్చ్ 8 మహా శివరాత్రి సందర్బంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కన్నప్పగా మంచు విష్ణు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్ లో,  చేతులో విల్లుతో, మంచు కొండల నుండి బయటకు వస్తున్నట్టుగా ఉన్న లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఇక ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. భారీ హాగులతో, విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా విడుదల చేసిన కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఆడియన్స్ నుండి కూడా పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

ALSO READ :- Rashmika Mandanna: యాక్షన్ కాదు రొమాన్స్ కావాలి.. రూమర్స్పై స్పందించిన రష్మిక

ఇక కన్నప్ప సినిమాలో అన్ని భాషల నుండి స్టార్ హీరోలు యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ శివుడిగా కనిపించనుండగా, పార్వతిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారని సమాచారం. ఇంకా ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజు కుమార్, తెలుగు నుండి బాలకృష్త్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మరి ఇన్ని ప్రత్యేకతలు మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.