మూవీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్: కన్నప్ప సినిమా రిలీజ్ వాయిదా..

మూవీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్: కన్నప్ప సినిమా రిలీజ్ వాయిదా..

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు నటిస్తూ, నిర్మిస్తున్న కన్నప్ప సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 25న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇందులో భాగంగా మంచు విష్ణు ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశాడు. 

ఇందులో కన్నప్ప సినిమా మంచి క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నాని దీంతో VFX ఎడిటింగ్స్ కోసం మరికొన్ని వారాలపాటు పని చేయాల్సి  ఉందని తెలిపాడు. కన్నప్ప పరమశివుడి నిజమైన భక్తుడని దీంతో ఈ పాత్రని మరింత గొప్పగా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఈ విషయాల్ని అర్థం చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మంచు విష్ణు కోరాడు. అలాగే త్వరలోనే మరో కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. దీంతో మంచు విష్ణు ఫ్యాన్స్ తోపాటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతున్నారు.

ALSO READ | L2: Empuraan collections: 48 గంటల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఎల్2: ఎంపురాన్..

కన్నప్ప సినిమాకి బాలీవుడ్ ప్రముఖ సినీ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తుండగా సీనియర్ హీరో మంచు మోహన్ బాబు మహాదేవయ్య శాస్త్రి పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడు పాత్రలో నటిస్తుండగా, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కాజల్ అగార్వల్ పార్వతి పాత్రలో నటిస్తోంది. శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.