
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం వాయిదా పడింది. వాస్తవానికి ఏప్రిల్ 25న వరల్డ్‌వైడ్‌గా సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించగా, శనివారం రిలీజ్ పోస్ట్‌పోన్ చేసినట్టు అనౌన్స్ చేశారు.
‘కన్నప్ప ప్రయాణం అద్భుతమైనది. ప్రేక్షకులకు హై స్టాండర్డ్స్‌తో కూడిన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించాలనుకుంటున్నాం. దీనికి మరికొంత సమయం అవసరం ఉంది. కీలక ఎపిసోడ్స్‌కు సంబంధించి వీఎఫ్‌ఎక్స్ పనులు ఇంకా కంప్లీట్ కాకపోవడంతో విడుదలను వాయిదా వేస్తున్నాం. బెస్ట్ అవుట్‌పుట్‌తో త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’ అని మూవీ టీమ్ ఒక నోట్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది.