మంచు ఫ్యామిలీ(Manchu Family) నుండి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కన్నప్ప(Kannappa). పరమ శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. మంచు సొంత బ్యానర్ నుండి వస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయిన మంచు విష్ణు.. కన్నప్ప కోసం ఇండియా వైడ్ గా ఉన్న స్టార్స్ అందరిని దించుతున్నాడు.
అందులో.. ప్రభాస్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, నయనతార, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఉన్నారు. అందుకే.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది. ఇందులో భాగంగానే కన్నప్ప టీజర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చాడు హీరో మంచు విష్ణు. ఈ సినిమా టీజర్ జూన్ 14న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
After an overwhelming reception at Cannes, I am thrilled to share the teaser for this epic tale, 'Kannappa', with you on 14th June. This film holds a special place in my heart, and I can’t wait to welcome you all to the captivating world of #Kannappa🏹. #kannappateaser… pic.twitter.com/bhmCEi6K4s
— Vishnu Manchu (@iVishnuManchu) June 7, 2024
ఈ ప్రకటన చేస్తూ కన్నప్ప నుండి కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. అడవిలో గుర్రంపై వెళ్తున్న కన్నప్పను వెనుకనుండి చూపిస్తూ టీజర్ పై ఆసక్తిని పెంచారు. ఇక ఈ టీజర్ విషయాన్ని తెలియజేస్తూ.. కేన్స్‌లో కన్నప్ప టీజర్ కు అద్భుతమైన ఆదరణ వచ్చింది. ఆ అద్భుతమైన టీజర్ ను జూన్ 14న మీతో పంచుకోవడానికి థ్రిల్ ఫలవుతున్నాను. ఈ చిత్రానికి నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం కన్నప్ప కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.