మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భక్త కన్నప్ప’. ఇటీవల శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మహాభారతం సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. న్యూజిలాండ్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు మంచు విష్ణు ట్వీట్ చేశాడు. ‘శివ పార్వతుల ఆశీస్సులతో ఏడేళ్ల నా శ్రమ, కల నిజం కాబోతోంది. గత ఎనిమిది నెలలుగా టీం అంతా నిద్రలేని రాత్రులు గడిపింది. ఇందులో ఎంతో మంది సూపర్ స్టార్లు నటించబోతున్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే రివీల్ చేయబోతున్నాం’ అని పోస్ట్ చేశాడు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలుగా పని చేస్తున్నారు.