
Star Hero Wife: టాలీవుడ్ ప్రముఖ హీరో, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇన్సిడెంట్స్ గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులోభాగంగా ఇటీవలే కొందరు టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో భార్య, కూతరిని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని దీంతో ఈ విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. అయితే ఆ స్టార్ హీరో తన భార్య, కూతురిపై ట్రోలింగ్ జరగడంతో ఇండస్ట్రీలో "ఇలాంటివి నువ్వు చూసుకోవాలి కదా.. మా ప్రెసిండెంట్ గా నువ్వున్నది ఎందుకంటూ ప్రశ్నించాడని దీంతో ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత ఈ ట్రోలింగ్ విషయాన్ని పర్సనల్ గా తీసుకుని పరిష్కరించేందుకు పూనుకున్నానని ఈ క్రమంలో తనకి రూ.లక్షల ఖర్చయిందని కానీ ఆ ఖర్చంతా తానె భరించానుతప్ప "మా" నుంచి తీసుకోలేదని చెప్పుకొచ్చాడు.. ఇక ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు గురించి కుడా కొందరు ఆయన మరణించినట్లు ప్రచారాలు చేశారని దీంతో కోట శ్రీనివాస్ రావు ఈ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా సానుకూలంగా స్పందించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినవారిపై యాక్షన్ తీసుకున్నామని తెలిపాడు..
Also Read:-హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న స్టార్ హీరో డాటర్..
అయితే నెగిటివ్ ట్రోలింగ్ ని ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో కొంతవరకు మాత్రమే అరికట్టామని పూర్తిగా అరికట్టలేకపోయామని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ట్రోలింగ్ కి గురైన హీరో భార్య, కూతురి వివరాలు మాత్రం తెలియజేయడానికి మంచు విష్ణు ఇష్టపడలేదు.. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో మంచు విష్ణు తెలుగులో కన్నప్ప అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో విష్ణు పరమశివుడు భక్తుడిగా కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. దీంతో ఏప్రిల్ మొదటివారంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.