KannappaTeaser: మంచు విష్ణు కన్నప్ప టీజర్ రిలీజ్.. భక్తి, త్యాగం మరియు గొప్పతనం

KannappaTeaser: మంచు విష్ణు కన్నప్ప టీజర్ రిలీజ్.. భక్తి, త్యాగం మరియు గొప్పతనం

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' (Kannappa) టీజర్ వచ్చేసింది. 2025 ఏడాది మొదలైన నుంచి ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా నేడు (మార్చి 1న) కన్నప్ప సెకండ్ టీజర్ గ్రాండ్గా రిలీజయింది. కన్నప్ప ఫస్ట్ టీజర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌లో ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’ పేరుతో రిలీజ్ చేశారు.

బాలీవుడ్ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న కన్నప్ప లేటెస్ట్ టీజర్ ఆసక్తికరంగా సాగింది. విష్ణు నటన, టీజర్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తిన్నడు పాత్రలో మంచు విష్ణు కనిపించాడు. తన వారి కోసం ఎంతటి వారినైనా ఎదిరించే వాడిగా విష్ణు ఆకట్టుకున్నాడు.

'ఆపద వచ్చిన ప్రతిసారి వీరుల తలలు కోరుకునే ఈ రాయి దేవత కాదు' అనే విష్ణు డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? అని శివుడి భార్యగా పార్వతి పాత్రలో నటించిన కాజల్ చెప్పే డైలాగ్ సైతం ఆసక్తిగా ఉంది. ఈ టీజర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే భక్తి, త్యాగం మరియు గొప్పతనం యొక్క చారిత్రక కథనాన్ని చెప్పే దిశగా సాగింది.

టీజర్ చివర్లో ప్రభాస్ 'డివైన్ గార్డియన్' రుద్రుడిగా కనిపించిన విజువల్స్ కన్నుల పండుగలా అనిపిస్తోంది. అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో మంచి ఆహార్యాన్ని, గాంభీర్యాన్ని కనబరిచాడు. ఇకపోతే, ఈ మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. దాంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. 

ఇటీవలే కన్నప్ప నుండి రిలీజ్ చేసిన శివా శివా శంకరా అంటూ సాగిన పాట శ్రోతలను వీపరీతంగా ఆకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్‌ ప్రకాష్ పాడారు. ప్రభుదేవా పాటని కొరియోగ్రాఫ్ చేశారు. స్టీఫెన్ దేవస్సీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ పాట చూసి ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. యూట్యూబ్లో ఒక్క నెగిటివ్ కామెంట్ లేకుండా పాట సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు టీజర్ వంతు.. ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయనుందో అని ఆసక్తి కలిగిస్తోంది. 

ఈ భక్తి రస ప్రాజెక్ట్లో పలు ఇండస్ట్రీల స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు, శరత్ కుమార్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ భాగమయ్యారు. ఈ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ నటిస్తుండగా రుద్రగా ప్రభాస్ కనిపిస్తున్నాడు.

ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవస్సే మ్యూజిక్, బీజీఎం అందిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి మంచు ఫ్యామిలీలోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.