భక్త కన్నప్ప ఆర్టిస్ట్రీ మేకింగ్‌ గ్లింప్స్ అదిరిపోయింది..

భక్త కన్నప్ప ఆర్టిస్ట్రీ మేకింగ్‌ గ్లింప్స్ అదిరిపోయింది..

మంచు విష్ణు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భక్త కన్నప్ప’(Bhakta Kanappa ). ఇటీవల శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మహాభారతం సీరియల్‌‌కు దర్శకత్వం వహించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్ ఫేమస్ నటీనటులు కీలకపాత్రలలో నటించనున్నారని తెలుస్తోంది. 

లేటెస్ట్ గా ఈ మూవీ టీం షూటింగ్ వర్క్స్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. షూటింగ్ లొకేషన్ లో భాగంగా మంచు విష్ణు ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆర్టిస్ట్రీ మేకింగ్‌లో గ్లింప్స్ అదిరిపోయింది. ప్రతి ఆర్టిస్ట్రీ విభాగం ఒక్కో వస్తువుని తయారుచేసే విధానం చూపించారు. అలాగే ఈ సినిమా కోసం మొత్తం 800 మంది సెట్ తయారీ బృందం..5 నెలలుగా కష్టపడి ఈ ఆర్ట్ వర్క్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇందుకోసం 8 కంటెయినర్లకు సరిపడ సెట్ ప్రాపర్టీని న్యూజిలాండ్(New Zealand) కు తరలించినట్లు పేర్కోన్నారు. ఇక భక్త కన్నప్ప మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లో కంప్లీట్ చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. 

హీరో విష్ణుకి జోడిగా బాలీవుడ్ కృతిసనన్ సిస్టర్ నుపుర్ సనన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినా, కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ కథను అందిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. 

చాలా కాలంగా వరుస డిజాస్టర్ మూవీస్ తో ఉన్న విష్ణు కి..భక్త కన్నప్ప అయినా దయచూపి హిట్ ఇస్తే చూడాలనుకుంటున్నారు మంచు ఫ్యాన్స్. మోసగాడు,జిన్నా వంటి డిజాస్టర్స్ తర్వాత వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం భక్త కన్నప్ప. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు(Mohanbabu) నిర్మిస్తున్నారు.