
మంచు విష్ణు, మోహన్ బాబుల డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్పు'. ఈ మూవీ జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తిచేసుకున్న ఈ మూవీ.. ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా మే 8వ తేదీ నుంచి అమెరికాలో ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. న్యూజెర్సీలో రోడ్ షోతో పాటు డల్లాస్, లాస్ ఏంజిల్స్లో ఈవెంట్స్ ఉండేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇంటెర్నేషనల్ లెవల్లో రోడ్ షో, భారీ ఈవెంట్స్ ప్రకటించడం చూస్తుంటే, మంచు విష్ణు మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు అర్ధమైపోతుంది.
ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న 'కన్నప్ప'లో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. మంచు మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Mark your calendars! 📅 The legend of #Kannappa🏹 hits the big screen on 27th June! 🎥#HarHarMahadevॐ pic.twitter.com/d9TtzAJ1MI
— Vishnu Manchu (@iVishnuManchu) April 10, 2025
ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి, విష్ణునే కథ, స్క్రీన్ ప్లే అందించారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇక, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.