హాలీవుడ్ స్టార్ విల్‌‌ స్మిత్‌‌తో విష్ణు ప్రాజెక్ట్‌‌

హాలీవుడ్ స్టార్ విల్‌‌ స్మిత్‌‌తో విష్ణు ప్రాజెక్ట్‌‌

ఇప్పటికే నిర్మాతగా, విద్యా సంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్న హీరో మంచు విష్ణు.. ఇప్పుడు తరంగ వెంచర్స్‌‌ అనే సంస్థతో మీడియా, ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు.  ప్రముఖ హాలీవుడ్ స్టార్‌‌‌‌ విల్‌‌ స్మిత్‌‌  ఈ సంస్థలో భాగస్వామి కాబోతున్నట్టు విష్ణు ప్రకటించారు. మీడియా, వినోద రంగంలో ఆవిష్కరణలను పెంచడం లక్ష్యంగా ఈ సంస్థ పని చేయనుంది. 50 మిలియన్ డాలర్ల పెట్టుబడితో దీన్ని ప్రారంభించనున్నారు.

ఇందులో విల్ స్మిత్‌‌ని కీలక భాగస్వామిగా చేర్చడానికి చివరి దశ చర్చలు జరుగుతున్నాయని మంచు విష్ణు చెప్పారు. యానిమేషన్, గేమింగ్,  ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్, బ్లాక్ చెయిన్, ఏఆర్‌‌‌‌, వీఆర్‌‌‌‌, ఏఐ లాంటి సాంకేతిక సేవలను ఈ సంస్థ అందించనుంది. ఇందులో విష్ణుతో పాటు ఆదిశ్రీ, ప్రద్యుమన్ ఝలా, వినయ్ మహేశ్వరి, దేవేష్ చావ్లా, సతీష్ కటారియాతో పాటు విల్ స్మిత్ భాగస్వాములుగా ఉండనున్నారు. ఇక విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌‌లో విడుదల కానుంది.