యాదగిరిగుట్టకు మంచు విష్ణు.. స్వామి వారికి ప్రత్యేక పూజలు

హీరో మంచు విష్ణు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆయనకు.. పూజారులు స్వామి వారి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఇక ఆయన సినిమా విషయాలకొస్తే ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జిన్నా. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో అంగరంగవైభవంగా జరిగింది.

జిన్నా మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.