మంచు ఫ్యామిలీ వివాదం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.. మంచు మోహన్ బాబు, మనోజ్ పరస్పర కేసులు, మీడియాపై దాడి..కోర్టులో పిటిషన్లు.. రాచకొండ సీపీ మంచు ఫ్యామీలికి నోటీసులివ్వడం..పిలిచి వార్నింగ్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.
తన నాన్న మంచి వ్యక్తే కానీ.. అన్న విష్ణు వల్లే ఇదంతా జరుగుతుందని మీడియా ముందు మనోజ్ చెప్పిన సంగతి తెలిసిందే.. తాను హైదరాబాద్ లో ఉంటే ఇదంతా జరిగేది కాదని విష్ణు అన్నాడు. మళ్లీ ఈ వివాదంపై గొడవ చేయబోం.. కూర్చుని మాట్లాడుకుంటాం..అని మంచు బ్రదర్స్ ఇద్దరు రాచకొండ సీపీకి బాండ్ రాసిచ్చారు. దీంతో రెండు రోజులుగా ఈ వివాదం కాస్త సైలెంట్ అయిపోయింది.
ALSO READ : మోహన్ బాబు పరారీలో లేడు.. పోలీసుల వివరణ
ఈ క్రమంలో ఇవాళ(డిసెంబర్ 13) మంచు విష్ణు తన ఎక్స్ లో పెట్టిన ట్వీట్ ఇపుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 14న మధ్యాహ్నం 12 గంటలకు తన మనసుకు దగ్గరైన విషయం గురించి చెబుతానంటూ పోస్ట్ పెట్టాడు. మంచు ఫ్యామిలీ వివాదం జరుగుతున్న క్రమంలో మంచు విష్ణు ఏ విషయంపై ప్రకటిస్తాడు. గొడవ గురించా? లేక రిలీజ్ కు రెడీగా ఉన్న తన సినిమా భక్త కన్నప్ప మూవీ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారా? అని చర్చించుకుంటున్నారు.