వంశీని గెలిపిస్తే పరిశ్రమలు : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

దండేపల్లి, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరారు. గురువారం దండేపల్లి మండలం కన్నెపల్లి లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, రాష్ట్రంలో మాదిరిగా ఢిల్లీలో కూడా హస్తం పార్టీ ప్రభుత్వం ఏర్పడాలంటే వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. విద్యావంతుడైన వంశీని గెలిస్తే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి, ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు.