దండేపల్లి, వెలుగు: ప్రజల పక్షాన నిలిచి సంక్షేమ పథకాలు అందించేది కేవలం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమేనని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో దండేపల్లి మండలంలోని కన్నెపల్లి జిన్నింగ్ మిల్లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంతోపాటు, ఐకేపీ ఆధ్వర్యంలో నంబాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొలుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలన్నారు.
గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో దాతల సహకారంతో రూ.30 లక్షలతో నిర్మించిన వ్రత మండపాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, తహసీల్దార్ సంధ్యా రాణి, ఎంపీడీవో జేఆర్ ప్రసాద్,ఐకేపీ ఏపీఎం భూపతి బ్రహ్మం,మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్, కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ గోపతి సునీత, కటుకూరి రాజన్న, గూడెం ఆలయ ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.