వరంగల్: అన్ని వర్గాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని, జనాభా నిష్పత్తి ప్రకారం పదవులు చోటు కల్పించాలని మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం వరంగల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి మండలిలో మాదిగలకు చోటు ఇవ్వాలన్నారు. వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఆదివాసుల కు మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలన్నారు.
అక్టోబర్ 13 తేదీన హైదరాబాద్ లో మరో మహా దీక్ష చేస్తామని తెలిపారు. డిసెంబర్ 13 చలో ఢిల్లీ ని నిర్వహిస్తున్నామని మంద కృష్ణ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో బ్రాహ్మణ, వైశ్యులకు కూడా తీవ్ర అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు.