
- మంద కృష్ణ మాదిగ
ఖైరతాబాద్, వెలుగు : ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ శాస్త్రీయంగా లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషన్ గడువు ఈ నెల 10తోనే ముగిసినా.. లోపాలను గుర్తించి మరోసారి అధ్యయనం చేయాలని తాను సీఎంను కోరడంతో కమిషన్ గడువును మార్చి 10 వరకు పెంచినట్లు చెప్పారు.
ఏ కులానికీ అన్యాయం జరగకూడదన్నదే తన ధ్యేయమని చెప్పారు. గడువు ముగిసే లోపు 58 కుల సంఘాల నాయకులు తమ విజ్ఞప్తులను అందజేయాలని సూచించారు. మార్చి 11 తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంకటేశ్ నేతకాని, ఇస్మాయిల్ పాల్గొన్నారు.