బండి సంజయ్ గెలిస్తే సీఎం అయితడు : మందకృష్ణ మాదిగ

బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ సీఎం అవుతాడని అన్నారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. బండి సంజయ్ కు మద్దతుగా కరీంనగర్ లోని  మైత్రీ కన్వెన్షన్ నుంచి రేకుర్తి వరకు ఆయన  భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.  బండి సంజయ్ ఒక యుద్ద వీరుడని,  అతనికి ప్రధాని మోదీ అండ ఉందన్నారు. 

75 ఏళ్లుగా బీసీలకు సీఎం అయ్యే అవకాశమే రాలేదని.. ఇప్పుడు బీజేపీ ద్వారా మనకు అపూర్వ అవకాశమొచ్చిందన్నారు మందకృష్ణ మాదిగ.  కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా అధికారం చెలాయించిన పార్టీలన్నీ మోసం చేశాయని ఆరోపించారు.   ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.