బోధన్,వెలుగు: పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అల్లంపూర్ నుంచి చేపట్టిన విశ్వరూప మహాపాదయాత్రకు బోధన్ మండలం బెల్లాల్ కు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ సంఘీభావం తెలిపారు.
అనంతరం మందకృష్ణ మాదిగతో పాదయాత్రలో పాల్గొన్నారు. సూర్యవంశీ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ జాతి కోసం పాదయాత్ర చేయడం హర్షణీయమన్నారు.