మంద కృష్ణది ద్వంద్వ వైఖరి: పిడమర్తి రవి

మంద కృష్ణది ద్వంద్వ వైఖరి: పిడమర్తి రవి

బషీర్​బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చేసి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమనే నైతిక హక్కు మందకృష్ణ మాదిగకు లేదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణలో ఒకలా, ఏపీలో ఇంకోలా ఆయన ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మాదిగ సంఘాల సంయుక్త సమావేశం సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‎లో  జరిగింది. 

ఈ సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడుతూ.. తెలంగాణలో జిల్లాల వారీగా, వర్గీకరణ చేయాలంటే కృష్ణ మాదిగ స్పందించలేదని, ఏపీలో మాత్రం జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. ఏపీలో మాదిగలకు 7 శాతం రిజర్వేషన్స్ ఇప్పించాలని రవి డిమాండ్ చేశారు. ఏపీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.కృపాకర్ మాదిగ, సతీశ్ మాదిగ, మేరీ, దండు వీరయ్య పాల్గొన్నారు.