వరంగల్, వెలుగు : ఓ ఛానల్ డిబేట్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య జరిగిన ఘర్షణను మున్నూరు కాపు సంఘానికి రుద్దడం సరికాదని ఆ సంఘం నాయకుడు మందా శ్రీనివాస్ అన్నారు. వరంగల్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. పదే పదే కులం గురించి ప్రస్తావిస్తున్న నరేందర్ ఒరిజినల్ మున్నూరు కాపేనా అని ప్రశ్నించారు.
మున్నూరుకాపుల అభివృద్ధికి ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి కుల సంఘాలను లాగొద్దని సూచించారు.