ఖైరతాబాద్, వెలుగు : ఈ నెల11న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము నిర్వహించే సభకు చీఫ్‌గెస్టుగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించామని చెప్పారు. ఏ ఆశయం కోసం ఎమ్మార్పీఎస్‌ను తీసుకొచ్చామో అది ఇప్పుడు నెరవేరే సమయం వచ్చిందని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక,మహారాష్ట్ర ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా విశ్వరూప మహాసభకు హాజరవుతున్నారని, కూలి చేసుకున్న డబ్బులతో హైదరాబాద్ వచ్చి .. అందుబాటులో ఉన్న రవాణ సదుపాయాలను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విశ్వరూప మహాసభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.