కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ ఫైర్​

ధర్మసాగర్, వెలుగు: కూతురికి టిక్కెట్ కోసమే కడియం శ్రీహరి కేసీఆర్ మాటలను సమర్థిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సోయిలేని మాటలు మాట్లాడుతుంటే  కడియం శ్రీహరి సమర్ధించడం ఆయన బానిసత్వాన్ని బయటపెడుతోందన్నారు. కూతురుకు స్టేషన్ ఘన్​పూర్ ​టిక్కెట్ కోసమే కేసీఆర్ ను సమర్థిస్తున్నాడని ఆరోపించారు. రిజర్వేషన్ లేని వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన శ్రీహరికి ఎస్సీ రిజర్వేషన్ అయిన స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యేగా అవకాశం రావడానికి భారత రాజ్యాంగమే కారణమని గుర్తుపెట్టుకోవాలని మండిపడ్డారు.