అన్ని కులాలకు సమన్యాయం చేయండి : మంద కృష్ణ మాదిగ

అన్ని కులాలకు సమన్యాయం చేయండి : మంద కృష్ణ మాదిగ
  •     వన్​మెన్ కమిషన్ చైర్మన్​కు మంద కృష్ణ వినతి

హైదరాబాద్, వెలుగు : ఎస్సీ వర్గీకరణపై వన్ మెన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో లోపాలను సవరించాలని, అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని వన్ మెన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్​ను ఎంఆర్​పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. బుధవారం బీఆర్కే భవన్​లో మందకృష్ణ ఆయనను కలిసి రిపోర్టులోని లోపాలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

అత్యంత వెనుకబడిన బుడగ జంగం, డక్కలి, మాంగ్ వంటి కులాలను అభివృద్ధి చెందిన పంబాల, మన్నె కులాలతో కలిపి ఒకశాతం రిజర్వేషన్ కేటాయించారని, దీంతో అత్యంత వెనకబడిన ఆ కులాలు మళ్లీ దోపిడీకి గురవుతాయన్నారు. మధ్యస్థ వెనుకబడిన కులాలను గ్రూప్ 2లో చేర్చి ఒకశాతం రిజర్వేషన్ కేటాయించారని చెప్పారు. సరైన సూత్రాలను ప్రామాణికంగా తీసుకుని మాదిగలకు న్యాయం చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.