బీజేపీతోనే సామాజిక న్యాయం : మందకృష్ణ

యాదాద్రి, వెలుగు : బీజేపీతోనే సామాజిక న్యాయం జరిగిందని, జరుగుతుందని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల వారు బీజేపీకి అండగా నిలిచి గెలిపించాలని ఆయన కోరారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్​ ఉత్తమాటలే చెప్పిందని, బీజేపీ ఆచరణలో చూపుతున్నదన్నారు. రిజర్వేషన్లలో అన్యాయం జరిగిన విషయాన్ని 1965లో కాంగ్రెస్​ వేసిన కమిషన్​ చెప్పిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. కమిషన్​ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్​ చెత్తలో వేసిందన్నారు. అప్పటి నుంచి జరుగుతన్న అన్యాయాన్ని  సరిదిద్దాలనే తాము కోరుతున్నామని తెలిపారు.