ముదిగొండ : మండల కేంద్రంలో బుధవారం పలు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి రాధ తనిఖీ చేశారు. రికార్డు నమోదు తప్పనిసరి ఉండాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు రసీదు ఇవ్వాలన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఎరువుల దుకాణం సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.