కూసుమంచి, వెలుగు : నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని మండల ఏవో వాణి సూచించారు. గురువారం మండలంలోని ముత్యాలగూడెంలో ఆమె రైతులతో మాట్లాడారు. గుడ్డ సంచులలో కానీ, నకిలీ లేబుల్ తో ఉన్న ప్యాకెట్లలో కానీ విత్తనాలు అమ్మితే తీసుకోవద్దన్నారు.
లైసెన్స్ కలిగిన డీలర్ నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, బిల్లును జాగ్రత్తపరచుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలన్నారు.