
శివ్వంపేట, వెలుగు: మండల కేంద్రంలో ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన మినరల్వాటర్ ప్లాంట్ను దసరా రోజు మండల కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి నవీన్ గుప్తా ప్రారంభించారు. తన తల్లితండ్రులైన పులిమామిడి అంజమ్మ, మల్లేశం గుప్తా జ్ఞాపకార్థం సొంత నిధులతో ఆయన ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తాగునీటిని ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, పీఎన్జీ యువసేన సభ్యులు పాల్గొన్నారు.