![సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి : నిమ్మ రమేశ్](https://static.v6velugu.com/uploads/2025/02/mandal-congress-president-nimma-ramesh-has-demanded-that-yashwanth-reddy-resign-from-post-of-society-chairman_Oqboe3yid9.jpg)
టేక్మాల్, వెలుగు: అవినీతికి పాల్పడి రైతులను మోసం చేసిన టేక్మాల్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ యశ్వంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మ రమేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం టేక్మాల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టేక్మాల్ సహకార సంఘంలో అవినీతి జరిగిందని డైరెక్టర్లు ఫిర్యాదు చేయడంతో సహకార శాఖ అధికారులు పెట్రోల్ బంక్ , వరి కొనుగోలు కమీషన్, షేర్ అమౌంట్ పై పూర్తి విచారణ జరిపి రూ.21,34,933ల అవినీతి జరిగినట్లు గుర్తించారని తెలిపారు. అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామ చేస్తానని గతేడాది ఆగస్టు 10న ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని ఫ్రాడ్ చేసిన డబ్బులు వడ్డీతో సహా చెల్లించి రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆయన వెంట మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు యూసఫ్, సొసైటీ డైరెక్టర్లు నరసింహ రెడ్డి, పాపయ్య, సత్యనారాయణ, నరేందర్, శ్రీరాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాన్ కిషన్, శ్రీధర్, అశోక్ రెడ్డి, భూమిరెడ్డి ఉన్నారు.