క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి : డాక్టర్ పుష్పలత

హుజూర్ నగర్, వెలుగు : క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత సిబ్బందికి సూచించారు. ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం లింగగిరి లో క్షయవ్యాధి నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయవ్యాధి నివారణకు మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు

రాత్రి వేళల్లో చెమటలు పట్టడం, బరువు తగ్గటం, ఆకలి మందగించడం, తెమడలో రక్తజీరలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు,  పౌష్టికాహారం నిమిత్తం నెలకు రూ.500 ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్ వో  పద్మ, హెచ్ఈవో  ప్రభాకర్, మమత, రామకృష్ణ, శ్రీనివాస్, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.