మాలలను కించపరిచేలా మాట్లాడితే సహించం

మాలలను కించపరిచేలా మాట్లాడితే సహించం

సికింద్రాబాద్​, వెలుగు: మాలలను కించపరిచేలా మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ వైఖరి మార్చుకోవాలని భీమ్ మిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల భాస్కర్ హెచ్చరించారు. సోమవారం ఓయూ ఆర్ట్స్​ కాలేజీ వద్ద మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 27న లక్ష డప్పులతో మాలలకు చావు డప్పు కొడ్తామన్న మంద కృష్ణ కామెంట్లను ఖండిస్తున్నామన్నారు. మాలలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యానించారన్నారు.

తెలంగాణ ఉద్యమంలో తమ పాటల ద్వారా చైతన్యం చేసిన కవులు, రచయితలను ప్రభుత్వం గుర్తించడాన్ని స్వాగతిస్తున్నామని, అందులో ఆరుగురు దళితులు ఉండడాన్ని యావత్ తెలంగాణ సమాజం గౌరవిస్తోందని హర్షించారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందేశ్రీ కి గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్, మాదాసు రాహుల్ పండుగ బాను తేజ, ప్రదీప్, మల్లికార్జున్, యశ్వంత్, అభిషేక్,బాలు తదితరులు పాల్గొన్నారు.